Wednesday, January 22, 2025

అన్ని డివిజన్ల అభివృద్ధికి సమ ప్రాధాన్యం: మైనంపల్లి హన్మంతరావు

- Advertisement -
- Advertisement -

మల్కాజిగిరి: నియోజకవర్గంలోని అన్ని డివిజన్‌ల అభివృద్ధికి సమ ప్రాధాన్యతనిచ్చానని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తెలిపారు. మంగళవారం ఆయన ఆనంద్‌బాగ్ డివిజన్ పరిధిలోని పీవీ ఎన్ కాలనీలో రూ. 22 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్డు పనులను స్థానిక కార్పొరేటర్ వై. ప్రేమ్‌కుమార్‌తో కలిసి ప్రారంభించారు. అ నంతరం నెరేమెట్ డివిజన్ పరిధిలోని ఆర్‌కెపురం చెరువు వద్ద తూమ్ నిర్మా ణ పనులను అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని డివిజన్‌లలో కాలనీలు, బస్తీలలో నెలకొన్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి నిధులు తీసుకొచ్చి ఆయా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు చెప్పారు.

తన పదవీ హయంలో మల్కాజిగిరి నియోజకర్గంలో నెలకొన్న అనేక ధీ ర్ఘకాలిక సమస్యలతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమాలలో ప్రాజెక్ట్ డీఈ పవన్, డీ ఈలు లౌక్య, మహేష్, ఏఈలు సృజన, శ్రీకాంత్, వర్క్ ఇన్‌స్పెక్టర్ రజనీకాంత్, సీనియర్ నా యకుడు బద్దం పరుశురాంరెడ్డి, మల్కాజిగిరి నియోజకవర్గం అధికార ప్రతినిధి జీఎన్‌వీ సతీష్‌కుమార్, మీడియా ఇన్‌ఛార్జి గుండా నిరంజన్, ఆనంద్‌బాగ్ డివిజన్ అధ్యక్షుడు సత్యమూర్తి, నాయకులు ఉపేందర్‌రెడ్డి, ఎస్ ఆర్ ప్రసాద్, బాబు, సత్యనారాయణ, సంపత్‌రావు, నరేష్‌కుమార్, నవీన్‌యాదవ్, ఉపేందర్, గోకుల్‌కుమార్, చెన్నారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, మహేష్, రాజు, రమేష్, యాదగిరి, వేముల శ్రీనివాస్, శంకర్‌రావు, ఉమాపతి, బ్రహ్మయ్య, సంతోష్ రాం దాస్, మోహన్‌రెడ్డి, కిషోర్, వేములు వెంకటేష్, సూరి, బాలకృష్ణ, నర్సింహ్మరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, వైశాలి,కవిత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News