Friday, November 15, 2024

మూడు నెలల గరిష్ఠానికి మార్కెట్ సూచీలు

- Advertisement -
- Advertisement -

Sensex Jul 28

1,041 పాయింట్లు ఎగసిన సెన్సెక్స్
16,930 వద్ద స్థిరపడిన నిఫ్టీ 

న్యూఢిల్లీ: ఈక్విటీ సూచీలు గురువారం వరుసగా రెండో రోజు కూడా లాభపడ్డాయి. ఫైనాన్స్, మెటల్స్, ఐటి స్టాకులు లాభాలతో మార్కెట్ సూచీలు 3 నెలల గరిష్ఠాన్ని తాకాయి. బిఎస్ సి సూచీ 1041.47 పాయింట్లు లేదా 1.87 శాతం లాభపడి 56858 వద్ద క్లోజ్ అయింది. కాగా నిఫ్టీ 287 పాయింట్లు లేదా 1.73 శాతం లాభపడి 16930 వద్ద ముగిసింది. సెన్సెక్స్ లో బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వీస్, టాటాస్టీల్, కొటక్ మహీంద్ర బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్ర, నెస్లే షేర్లు లాభపడగా, భారతీ ఎయిర్ టెల్, ఆల్ట్రా టెక్ సిమెంట్, డాక్టర్ రెడ్డీస్, ఐటిసి, సన్ఫార్మా నష్టపోయాయి. గురువారం దేశీయ మార్కెట్లు లాభపడ్డానికి ఆసియా, యూరొప్ మార్కెట్ల ఉధృతి కూడా తోడయింది. డాలరుకు రూపాయి విలువ 26 పైసలు పెరిగి రూ. 79.65 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి విలువ పెరుగడంతో విదేశీ మదుపరులు పొలోమని ఎంటర్ అయ్యారు. వారికి మళ్లీ భారత మార్కెట్లలో నమ్మకం కుదిరిందనిపిస్తోంది. జూలైలో విదేశీ మదుపరుల అవుట్ ఫ్లో బాగా తగ్గిపోయింది. నేటి వరకు విదేశీ మదుపరులు భారత మార్కెట్ల నుంచి రూ. 9251.7 కోట్లు ఉపసంహరించుకున్నారు. ఇప్పుడు ఎఫ్ఐఐలకు భారతీయ స్టాకు మార్కెట్లలో నమ్మకం కుదిరినందున విదేశీ మదుపులు తిరిగి పెరుగుతాయనిపిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News