- Advertisement -
యూనిట్ సగటు ధర రూ.4.15
విద్యుత్ కొనుగోలుకు ఈఆర్‌సి ఆమోదం
హైదరాబాద్: విద్యుత్ ఉత్పత్తి సంస్థల నుంచి డిస్కంలు కొనే కరెంట్ సగటు కొనుగోలు వ్యయం యూనిట్‌కు రూ.4.15లు అవుతుందని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్‌సి) లెక్కకట్టింది. 2019-20, 2020-21 ఆర్థిక సంవత్సరాలకు గాను ఏయే సంస్థల నుంచి ఏ మేరకు కరెంట్ కొనుగోలో చేస్తున్నాయో డిస్కంలు పిటీషన్ దాఖలు చేశాయి. దీనిపై విచారణ జరిపి కమిషన్ సగటు కొనుగోలు వ్యయం రూ.4.15లుగా ఈఆర్‌సి లెక్కకట్టింది. అత్యల్పంగా ఎన్‌పిసి కాగా, కూడంకుళం ప్లాంట్ల నుంచి యూనిట్‌కు 2.458 అవుతుండగా, అత్యధికంగా ఎన్టీపిసి (కుడిగి) నుంచి రూ.9.607లకు లభిస్తోంది. జెన్‌కో హైడల్ కేంద్రాల నుంచి యూ-నిట్ రూ.2.47లకే లభిస్తుండగా సింగరేణి నుంచి రూ.4.58లు చత్తీస్‌ఘడ్ నుంచి రూ.3.9లు అవుతుందని ఈఆర్సీ పేర్కొంది.
ERC approval for power purchase
- Advertisement -