Wednesday, January 22, 2025

ఛార్జీల షాక్ లేదు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్:విద్యుత్ వినియోగ చార్జీలు పెం చాలన్న డిస్కంల ప్రతిపాదనలను తెలంగాణ విద్యుత్ ని యంత్రణ మండలి (ఈఆర్సీ) తిరస్కరించింది. 300 యూనిట్లు దా టితే 10 నుంచి 50 శాతానికి ఫిక్స్‌డ్ ఛార్జీలు పెంచేందుకు అ నుమతి ఇవ్వాలని డిస్కంలు ఈఆర్సీ ముందు ప్రతిపాదన చే శా యి. సుదీర్ఘ చర్చల అనంతరం డిస్కంల ప్రతిపాదనను ఈ ఆర్సీ తిరస్కరించింది. డిస్కమ్‌లు చేసిన 8 ప్రతిపాదనలపై తమ అభిప్రాయాన్ని స్పష్టం చేశామని తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ టి.శ్రీరంగారావు తెలిపారు. సోమవారం పొద్దుపోయిన తర్వాత నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆ యన మాట్లాడుతూ నియంత్రణ మండలి తీసుకున్న పలు నిర్ణయాలను వెల్లడించారు. ఇతర రాష్ట్రాల్లో కరెంట్ ఛార్జీలు ఎలా ఉన్నాయనే వివరాలతో డిస్కంలు ఈఆర్సీకి తాజాగా నివేదికను అందజేశాయని ఆయన వెల్లడించారు. ఈ నివేదికను ఈఆర్సీ విచారణ పూర్తి చేసి, పరిశీలన అనంతరం పెంపు ప్రతిపాదనలను తిరస్కరించిందని తెలిపారు. 300 యూనిట్ల పైబడిన వారికి ఫిక్స్‌డ్ చార్జీలు పెంచాలని వచ్చిన ప్రతిపాదనను తిరస్కరించామని, 800 యూనిట్లపై బడిన వారికి ఫిక్స్‌డ్ చార్జీలు పెంచేందుకు అంగీకరించామని తెలిపారు. విద్యుత్ చార్జీలు ఏ కేటగిరిగిలో కూడా పెంచడం లేదని స్పష్టం చేశారు

. పౌల్ట్రీ ఫామ్, గోట్ ఫామ్‌లకు రూ.100 పెంచాలని ప్రతిపాదనలు వచ్చాయని దాన్ని ఆమోదించలేదని చెప్పారు. పరిశ్రమలకు ఎల్‌టి3 150 ఫిక్స్‌డ్ చార్జీలు పెంచాలని డిస్కమ్‌ల నుంచి ప్రతిపాదన వచ్చిందని దాన్ని 100కు కమిషన్ పరిమితం చేసిందని తెలిపారు. హెచ్‌టి కేటగిరిలో విద్యుత్ చార్జీల పెంపునకు తిరస్కరించామని చెప్పారు. 132 కెవిఏ, 33 కెవిఏ, 11 కెవిఏ కేటగిరీల్లో గతంలో ఎలా ఉన్నాయో అదే మాదిరిగానే విద్యుత్ చార్జీలు ఉంటాయని చైర్మన్ స్పష్టం చేశారు. స్థిర చార్జీలు రూ.10 యాదాతధంగా ఉంటుందని. చార్జీల సవరింపు వల్ల వినియోగదారులపై ఐదు నెలల కాలానికి రూ.30 కోట్ల భారం పడుతున్నందున డిస్కంల ప్రతిపాదనలను ఆమోదించలేదని వెల్లడించారు. విద్యుత్ సంస్థల ఆర్థిక స్థితిగతులు, వినియోగదారులు, ప్రభుత్వ సబ్సిడీ దృష్టిలో పెట్టుకొని కమిషన్ నిర్ణయం తీసుకుందని తెలిపారు. లిఫ్ట్ ఇరిగేషన్ కోసం రూ.270 ఫిక్స్‌డ్ చార్జీలను పెంచాలని వచ్చిన ప్రతిపాదనను ఆమోదించామని తెలిపారు. డొమెస్టిక్ కేటగిరీ 1 హార్టికల్చర్ వంటి వాటిని 15 హెచ్‌పి నుంచి 20 హెచ్‌పికి పెంచామని, ఎల్‌పి ఈవి ఛార్జింగ్‌లపై ఎలాంటి చార్జీలు ఉండవని కమిషన్ చైర్మన్ స్పష్టం చేశారు.

గృహ వినియోగదారులకు కనీస చార్జీలు తొలగించాం
గృహ వినియోగదారులకు కనీస చార్జీలు తొలగించామని చైర్మన్ పేర్కొన్నారు. లిఫ్ట్ ఇరిగేషన్‌కు కమిషన్ ఆమోదించిందని తెలిపారు. రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు నాన్ పీక్ ఆవర్‌లో రూపాయి నుంచి 1.50 రాయితీ పెంచామని, టైమ్ ఆఫ్ డే లో పీక్ అవర్‌లో ఎలాంటి మార్పు చేయలేదని వివరించారు. చేనేత కార్మికులకు హర్స్ పవర్‌ను పెంచామని చెబుతూ పది హెచ్‌పి నుంచి 25 హెచ్‌పికి పెంచేందుకు ఆమోదించినట్లు ఈఆర్సీ చైర్మన్ స్పష్టం చేశారు. కాగా గ్రిడ్ సపోర్ట్ చార్జీలను కమిషన్ ఆమోదించిందని తెలిపారు. అలాగే రూ.11,499.52 కోట్లు ప్రభుత్వం సబ్సిడీగా ఇచ్చిందని చెప్పారు. డిస్కంలు రూ.57,728.90 పిటిషన్ వేస్తే కమిషన్ రూ.54,183.28 కోట్లు ఆమోదించిందని తెలిపారు. ప్రభుత్వం నుంచి డిస్కంలకు రూ. 25వేల కోట్లు రావాల్సి ఉందని, డిస్కంలకు చెల్లించాల్సిన బకాయిలు ప్రభుత్వ సంస్థల నుంచి రప్పించుకోగలిగితే నష్టాల నుంచి బయటపడతాయని నియంత్రణ మండలి సూచించిందని చైర్మన్ శ్రీరంగరావు చెప్పారు.

నేటితో ముగుస్తున్న పదవీ కాలం
తన పదవీ కాలం మంగళవారంతో ముగుస్తుందని కమిషన్ చైర్మన్ శ్రీరంగారావు స్వయంగా వెల్లడించారు. ఈ నెలలోనే బహిరంగ విచారణ నిర్వహించి, సలహాలు, సూచనలు అన్ని తీసుకున్న తర్వాతే లోతైన పరిశీలన చేసి తాము నిర్ణయం తీసుకున్నామని వివరించారు. పిటిషన్ వేయడంలో విద్యుత్ సంస్థలు ఆలస్యం చేసినందున పెనాలిటీ చెల్లించాయని తెలిపారు. కేవలం 40 రోజుల్లో 8 పిటిషన్లపై సమగ్ర పరిశీలన చేసి వివేకతతో పని చేశామని గుర్తు చేశారు. ఇటీవలే విద్యుత్ నియంత్రణ భవన్ కొత్త ప్రాంగణాన్ని ప్రారంభించామని తెలిపారు. ప్రజాలపై భారం పడకుండా, అలాగే ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీని కూడా దృష్టిలో ఉంచుకుని తాము తీర్పు ఇవ్వాల్సి ఉందని అన్నారు.

రెవెన్యూ పై ట్రూ అప్ చార్జీల భారం పడకుండా, ఏ కేటగిరీకి కూడా విద్యుత్ చార్జీల పెంపునకు అనుమతించలేదని వెల్లడించారు. బస్, రైల్వేకు సంబంధించిన వాటిని కూడా పెంచలేదని వివరించారు. విద్యుత్ పంపిణీ సంస్థలు సకాలంలో పిటిషన్ వేయడంలో ఆలస్యం చేస్తున్నాయని, అందుకే వాటికి జరిమాన వేస్తున్నామని తెలిపారు. పేదలకు భారం కాకూడదని ఊదేశ్యంతో ఈ పెనాలిటీ వేశామని తెలిపారు. ఈ రూపంలో కమిషన్‌కు రూ.1.50 కోట్లు వచ్చాయని తెలిపారు. విద్యుత్ సంస్థలు పిటీషన్లు సకాలంలో వేయకపోవడం వల్ల ఏడాదికి రూ.582 కోట్లు విద్యుత్ సంస్థలు కోల్పోతాయని, 5 ఏండ్లలో రూ.2000 కోట్లు సంస్థలు కోల్పోయే అవకాశం ఉందని తెలిపారు. మొదటి సంవత్సరంగా భావించి ఆర్‌ఓఈ నిబంధనను ఒక ఏడాదికి మార్చామని తెలిపారు. అయితే దీన్ని కమిషన్ తీసుకున్న కఠిన నిర్ణయంగా చూడొద్దని చైర్మన్ సూచించారు. విద్యుత్ సంస్థలు ఇప్పటికైనా నవంబర్ 30 లోపు పిటిషన్ వేయాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News