Saturday, November 23, 2024

టర్కీలో మూడోసారి ఆయనే నేత

- Advertisement -
- Advertisement -

అంకారా : టర్కీ అధ్యక్షులుగా రెసిప్ తయీప్ ఎర్డొగాన్ తిరిగి ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన దేశాధ్యక్షుడి ఎన్నికల ఫలితాలు సోమవారం వెలువడ్డాయి. ఇప్పటి విజయంతో ఎర్డొగాన్ తిరుగులేని పాలన ఇప్పుడు మూడో దశాబ్ధంలోకి ప్రవేశించింది. సోలయిన ఓట్లలో ఆయనకు 52 శాతం ఓట్లు దక్కినట్లు అనధికారికంగా నిర్థారణ అయింది. ఆయన ప్రత్యర్థి కెమల్ క్లికోరోగ్లుకు 48 శాతం ఓట్లు పోలయ్యాయి. తిరిగి ఎర్డోగాన్ విజయం సాధించినట్లు ఎన్నికల మండలి ప్రకటించింది. తనకు తిరిగి అధికారంలోకి వచ్చే విధంగా ఓటేసి గెలిపించినందుకు ఓటర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇస్తాంబుల్, అంకారాల నుంచి ఈ మేరకు ఆయన తరఫున ప్రకటనలు వెలువడ్డాయి.

మరో ఐదేళ్లు ఆయన దేశాధ్యక్షులుగా ఉంటారు. తాను ఇప్పటికే ఇన్ని సంవత్సరాలు అధికారంలో ఉంటూ వచ్చానని, తిరిగి తనపై ఉంచిన నమ్మకానికి తగు విలువను కల్పిస్తానని ఆయన తెలిపారు. పరాజితుడైన కెమల్‌ను గేలిచేస్తూ బై బై చెప్పారు. ఇప్పటి విజేత కేవలం టర్కీనే అని పేర్కొంటూ ఆయన అంకారాలో తన అధికార నివాసం ముందు ఉన్న ప్రజల కేరింతల నడుమ తెలిపారు. తాను మరింత పట్టుదలతో టర్కిష్ శతాబ్ధం దిశలో పాటుపడుతానని, ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని వముమ్మ చేయబోనని తెలిపారు. ఓ వైపు దేశం తీవ్రస్థాయి ద్రవ్యోల్బణం, మరో వైపు దేశంలోని మొత్తం నగరాలను అతలాకుతలం చేసేసి వెళ్లిన భూకంపం దశలో ఎర్డోగాన్ శకం మరింత పదిలం అయింది.

ఇప్పటికి ఆయనకు ఇది మూడో సారి విజయం. దేశీయంగా, అంతర్జాతీయంగా ఆయన బలీయ వ్యక్తిగా పేరొందారు. యూరప్, ఆసియాల మధ్య కూడలి ప్రాంతంగా ఉండే టర్కీ ఎప్పటికప్పుడు నాటోలో కీలక పాత్ర పోషిస్తూ వస్తోంది. ఈ ఏడాది టర్కీ శతజయంతిని నిర్వహించుకోబోతోంది. ఈ దశలో ఆయన టర్కీకి సరికొత్త దశ ఆరంభం అవుతుందని వాగ్ధానం చేశారు. ప్రధాని మోడీ ఇతర ప్రపంచ నేతలు టర్కీ అధ్యక్షుడి విజయం పట్ల అభినందనలు తెలిపారు. భారత్ టర్కీ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగుపడుతాయని ఆశిస్తున్నట్లు ప్రధాని మోడీ తమ ట్వీటులో తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News