Monday, December 23, 2024

తిండిలేక భర్త, తల్లి మృతి…. మృతదేహాలతో వారం రోజులు ఇంట్లోనే మహిళ

- Advertisement -
- Advertisement -

చెన్నై: తమిళనాడు రాష్ట్ర ఈరోడ్ జిల్లాలో తినడానికి తిండి లేకపోవడంతో భర్త, తల్లి మృతి చెందారు. ఖననం చేయడానికి డబ్బులు లేకపోవడంతో మృతదేహాలను వారం రోజుల పాటు ఇంట్లోనే ఉంచిన సంఘటన గొపిచెట్టిపాలయంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…… వంటిప్పిట్టై కుమణన్ వీదిలో శాంతి అనే మహిళ తన తల్లి కనకంబాళ్, భర్త మోహన్‌సుందరం, కుమారుడు శరవణ కుమార్‌తో కలిసి ఉంటుంది. శాంతి కూతురు శశిరేఖ కూలీనాలీ చేసి కుటుంబాన్ని పోషించేది. కానీ శశిరేఖ పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్లడంతో కుటుంబాన్ని పోషించేవారు లేరు. శరవణన్ మానసిక దివ్యాంగుడు కావడంతో ఏ పని చేయలేడు. చుట్టు పక్కలవారు పెట్టే ఆహారంతో వారు జీవనం సాగించేవారు. తిండిలేక కనకంబాల్, మోహన్‌సుందరం చనిపోయారు. ఆ మృతదేహాలతో వారం రోజులు పాటు శాంతి, శరవణన్ ఇంట్లోనే ఉన్నారు. ఇంట్లో నుంచి చుట్టు పక్కలవారికి దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్టుమార్టమ్ నిర్వహించిన అనంతరం ఖననం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News