Monday, December 23, 2024

నవంబర్ 9న ఎర్ర చీర

- Advertisement -
శ్రీ సుమన్ వేంకటాద్రి ప్రొడక్షన్స్ – పద్మాలయా ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా బేబీ డమరి సమర్పణలో నిర్మించిన సౌత్ ఇండియా చిత్రం ఎర్ర చీర. ఇటీవల కాలంలో షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పూర్తిచేసుకుని నవంబర్ 9న విడుదల కానుంది. ఇందులో కళ్లు చెదిరేలా 36 నిమిషాల గ్రాఫిక్స్, లక్షలాది మంది అఘోరాలతో క్లైమాక్స్ తో కూడిన మదర్ సెంటిమెంట్, హర్రర్, యాక్షన్ ఎలిమెంట్స్ తో మంచి నిర్మాణ విలువలతో నిర్మించ్చబడినదని నిర్మాతల్లో ఒకరైన ఎన్వీవీ సుబ్బారెడ్డి తెలిపారు.
ఈ దీపావళి కానుకగా నవంబర్ 9న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం అని దర్శకుడు మరియు నటుడు అయిన సుమన్ బాబు తెలిపారు. ఈ సినిమాలో ప్రధాన పాత్రలలో శ్రీరామ్, kgf ఫేమ్ అయ్యప్ప పీ శర్మ, సీనియర్ నటులు Dr. రాజేంద్ర ప్రసాద్ గారి ముద్దుల మనవరాలు అయిన మహానటి ఫేమ్ సాయి తేజస్విని, కారుణ్య చౌదరి, కమల్ కామరాజు, సుమన్ బాబు, అజయ్, అలీ, రఘుబాబు, గీతాసింగ్, జీవ, భద్రం, సురేష్ కొండేటి, అన్నపూర్ణమ్మ, సత్య కృష్ణ తదితరులు నటించారు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News