Monday, January 20, 2025

ఎర్ర గంగిరెడ్డికి బెయిల్ రద్దు….

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వైఎస్ వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డికి హైకోర్టు బెయిల్ రద్దు చేసింది. మే 5లోపు సిబిఐ కోర్టులో లొంగిపోవాలని ఎర్ర గంగిరెడ్డికి హైకోర్టు ఆదేశించింది. గంగిరెడ్డి లొంగిపోకుంటే సిబిఐ అతడిని అదుపులోకి తీసుకోవాలని సూచించింది. జులై 1న గంగిరెడ్డికి బెయిల్ ఇవ్వాలని సిబిఐ కోర్టుకు హైకోర్టు ఆదేశించింది. జూన్ 30కి దర్యాప్తు పూర్తి కావొస్తున్న నేపథ్యంలో జులై 1న బెయిల్ ఇవ్వాలని హైకోర్టు సూచించింది.

Also Read: రాహుల్ విచారణ నుంచి తప్పుకున్న గుజరాత్ హైకోర్టు జడ్జి..

రూ.1.5 లక్షల పూచీకత్తుతో గంగిరెడ్డికి బెయిల్ ఇవ్వాలని హైకోర్టు తెలిపింది. వివేకా హత్య కేసు దర్యాప్తు కీలక దశలో ఉందని సిబిఐ అధికారులు కోర్టుకు తెలిపారు. నిందితుడు ఎర్ర గంగిరెడ్డి సాక్షులను బెదిరించడంతో పాటు భయపెడుతున్నారని సిబిఐ పేర్కొంది. కీలక నిందితుడు బయట ఉంటే దర్యాప్తుపై ప్రభావం పడుతుందని సిబిఐ కోర్టుకు విన్నవించింది. సిబిఐ వాదనతో సునీత తరఫు న్యాయవాదులు ఏకీభవించారు. 2019 మార్చి 28న గంగిరెడ్డిని ఎపి సిట్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 2019 జూన్ 27న గంగిరెడ్డికి పులివెందుల కోర్టు బెయిల్ ఇచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News