Saturday, April 5, 2025

ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ విచారణ… రేపటికి వాయిదా

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో వాదనలు ముగిశాయి. బెయిల్ రద్దు చేయాలన్న సిబిఐ పిటిషన్‌పై ఇరువర్గాల వాదనలు ముగిశాయి. తెలంగాణ హైకోర్టు తీర్పును రేపటికి వాయిదా వేసింది. ఎర్ర గంగిరెడ్డి సాక్ష్యాలను తారుమారు చేయడంతో పాటు సాక్షులను ప్రభావితం చేస్తాడని సిబిఐ తెలిపింది. విచారణకు ఎర్ర గంగిరెడ్డి సహకరించడంలేదని సిబిఐ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కడప ఎంపి అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై బుధవారం హైకోర్టు విచారించనుంది.

Also Read: ప్రేమించలేదని.. యువతిని గదిలో బంధించి వేడి నూనెతో చిత్రహింసలు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News