Sunday, January 19, 2025

జడ్చర్లలో కాంగ్రెస్కు షాక్.. బిఆర్ఎస్లో చేరిన ఎర్రశేఖర్

- Advertisement -
- Advertisement -

మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఒక్కొక్కరుగా సీనియర్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి.. భారత రాష్ట్ర సమితి(బిఆర్ఎస్)లో జాయిన్ అవుతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎంతో బలమైన నేత, మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్.. ఆదివారం కాంగ్రెస్కు రాజీనామా చేశారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆయన బిఆర్ఎస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా ఎర్ర శేఖర్ కు కెటిఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించి ఆహ్వానించారు. ఎర్ర శేఖర్ చేరికతో పాలమూరులో బీఆర్ఎస్ మరింత బలోపేతం అవుతుందని కెటిఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నసీఎం కేసీఆర్ నాయకత్వంలో పని చేస్తానని ఎర్ర శేఖర్ చెప్పారు. ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ తో అనుబంధం ఉన్నదని, మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్నప్పుడు కలిసి పనిచేశానని ఎర్ర శేఖర్ తెలిపారు.

Also Read: కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే అంధకారమే: కెటిఆర్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News