Wednesday, January 22, 2025

కాంగ్రెస్ గూటికి ఎర్ర శేఖర్.. తీవ్రంగా వ్యతిరేకించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ గూటికి ఎర్ర శేఖర్
సమర్థించిన గీతారెడ్డి.. తీవ్రంగా వ్యతిరేకించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ లో రేవంత్ వర్సెస్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిగా చేరికల వ్యవహారం సాగుతోంది. కాంగ్రెస్ లోకి మాజీ ఎంఎల్‌ఎ ఎర్ర శేఖర్ వచ్చారు. రేవంత్ సమక్షంలో ఆయన గురువారం పార్టీ కండువా కప్పుకున్నారు. అయితే ఎర్ర శేఖర్ చేరికను కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నేర చరిత్ర కలిగిన ఎర్ర శేఖర్‌ను పార్టీలోకి ఎలా చేర్చుకుంటారని ఆయన ప్రశ్నిస్తున్నారు. గాంధీ సిద్ధాంతాలను నమ్మే కాంగ్రెస్ లోకి నేరగాళ్లు వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎర్ర శేఖర్ చేరికపై అధిష్టానానికి ఫిర్యాదు చేసే యోచనలో కోమటిరెడ్డి వున్నారు. మరోవైపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి గీతా రెడ్డి కూడా చేరికను సమర్ధించారు.

కాగా తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఎర్రశేఖర్ ఉమ్మడి రాష్ట్రంలో మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నుంచి 2009 ఎన్నికల్లో పోటీ చేసి గెలి చారు. 2014లో ఇదే స్థానం నుంచి పోటీ చేసినప్పటికీ ఓటమి పాలయ్యారు. టిడిపి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడిగానూ పనిచేశారు. అనం తర పరిణామాలతో ఆయన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరారు. కానీ అక్కడి నేతలతో పొసగకపోవడంతో ఎర్ర శేఖర్ కొద్ది రోజుల క్రితం పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గురువారం కాంగ్రెస్ తీర్దం పుచ్చుకున్నారు. గతంలో మహబూబ్ నగర్ నుండి టిడిపి అభ్యర్ధిగా ప్రాతినిథ్యం వహించిన పొడపాటి చంద్రశేఖర్‌కు ఎర్ర శేఖర్ కుటుంబంతో బంధుత్వం ఉంది. పొడపాటి చంద్రశేఖర్ ఎన్టీఆర్, చంద్రబాబ కేటినెట్లలో పనిచేశారు. 2009 ఎన్నికల్లో పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని టిఆర్‌ఎస్‌కు కేటా యించడంతో చంద్రశేఖర్ పోటీకి దూరంగా ఉన్నారు. 2014 తర్వాత చంద్రశేఖర్ టిడిపిని వీడారు. ప్రస్తుతం ఆయన బిజెపిలో కొనసాగుతున్నారు.

Erra Shekhar Joins Congress

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News