Sunday, February 23, 2025

అభ్యర్ధి ఇంట్లో పెళ్ళికి ప్రత్యర్థులే అతిథులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో : ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి ఇంట్లో జరిగే పెళ్ళికి ఆయనకు వ్యతిరేకంగా పోటీ చేస్తున్న ప్రత్యర్ధులంతా అతిథులయ్యారు. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో సిపిఎం అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎర్రా శ్రీకాంత్ కుమారుడు జ్ఞానేశ్ వివాహం ఖమ్మం నగరంలోని లక్షీ గార్డెన్‌లో సోమవారం జరిగింది.

ఈ వివాహ మహోత్సవానికి ఆయనపై ప్రత్యర్థ్ధులుగా పోటీ చేస్తున్న ప్రధాన పార్టీ అభ్యర్ధులం తా వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించి వెళ్ళారు. బిఆర్‌ఎస్ అభ్యర్ధి పువ్వాడ అజయ్ కుమార్ తోపాటు కాంగ్రెస్ అభ్యర్ధి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఈ వివాహానికి వచ్చి నూతన వధూవరులను దీవించి వెళ్ళారు. ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా ఉన్నప్పటికి ఈ పెళ్ళికి హాజరయ్యారు. ఎన్నికల ప్రచార సభలో ఒకరినొక్కరు విమర్శించుకున్నప్పటికి రాజకీయాలు వేరు, వ్యక్తిగత సంబంధాలు వేరు అని మరోసారి నిరూపించుకున్నారు.

Erra Srikanth Marriage

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News