Sunday, January 19, 2025

చండూరు రూపు రేఖలు మారుస్తా: ఎర్రబెల్లి

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: మునుగోడు నియోజకవర్గం చండూరులోని 2వ, 3వ వార్డుల రూపు రేఖలను మారుస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికలో భాగంగా చండూరు 2వ, 3వ వార్డులలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మంత్రికి మహిళలు, రెండు వార్డుల ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. డప్పు చప్పుళ్లతో స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికీ వెళ్తూ టిఆర్ఎస్, కారు గుర్తుకు ఓటు వేయాలని మంత్రి అభ్యర్థించారు. ప్రజలను కలుస్తూ, వారి కష్ట సుఖాలను తెలుసుకుంటూ, వారితో మాట్లాడుతూ, ఫోటోలు దిగుతూ, ప్రచారం నిర్వహించారు. మంత్రి ఎర్రబెల్లితో పాటు ఎమ్మెల్సీ ఎల్.రమణ, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడారు. మునుగోడు నియోజకవర్గం, చండూరు లోని 2వ, 3వ వార్డులను దత్తత తీసుకుంటున్నానని తెలిపారు. ఈ రెండు వార్డుల రూపు రేఖలు మారుస్తామని, అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. సిసి రోడ్లు, మురుగు నీటి కాలువలు నిర్మిస్తామని, అందరికీ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని, ఇప్పటిదాకా మిమ్మల్ని నిర్లక్ష్యం చేసిన వాళ్ళను ఓడిస్తామని ఎర్రబెల్లి పేర్కొన్నారు. కారు, సారు, సర్కారు ను మరువొద్దని కోరారు. మునుగోడు ఉప ఎన్నికలలో టిఆర్ఎస్ ను గెలిపించాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News