Sunday, January 19, 2025

చండూరులో ఎర్రబెల్లి బైక్ ర్యాలీ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ నల్లగొండ న్యూస్: మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా చండూర్ మున్సిపాలిటీలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యే అరూరి రమేశ్, డిసిసిబి చైర్మన్ మా రవీందర్ రావు, వరంగల్ కుడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, మున్సిపాలిటీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ ర్యాలీ చండూరు మున్సిపాలిటీ పరిధిలో కలియ తిరుగుతూ ప్రధాన కూడలి వరకు సాగింది. భారీ ఎత్తున జరిగిన ఈ ర్యాలీలో వేలాది మంది టిఆర్ఎస్, కమ్యునిస్ట్ కార్యకర్తలు జెండాలు కట్టుకుని, బైకుల మీద టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించి, కారు గుర్తుకు ఓటు వేయాలని నినాదాలు చేశారు. భారీగా నిర్వహించిన ఈ ర్యాలీ పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News