హైదరాబాద్: మునుగోడు నియోజకవర్గం చండూరులో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో ఓ వృద్ధుడు ముచ్చటించారు. మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చండూరు మున్సిపాలిటీలో 2, 3 వార్డుల ఇంఛార్జీగా ప్రచార బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి మంగళవారం 3వ వార్డులో ఇంటింటి ప్రచారం చేస్తుండగా ఓ ఇంటికి వెళ్లగా, ఒక వృద్ధుడు మంత్రిని సైతం అబ్బుర పరిచేలా మాట్లాడారు. మునుగోడు ఓటర్ల మనోగతాన్ని ముక్కు మీద గుద్దినట్లుగా చెప్పారు.
సారే కావాలి! కారే రావాలి!!
ఆయన లేకపోతే బువ్వ ఎక్కడిది?
ఆయన వచ్చినంకనే బువ్వ!
ఆయన లేక పోతే బువ్వ లేదు, బట్ట లేదు!!
60, 70 ఏండ్ల కానుంచి ఆయన లాగా చేసిన మొనగాడే లేడు
ఆయన పోయిన తెల్లారి బువ్వ దొరకదు
ఆయన రావాలి, అందరికీ చెప్పుకుంట వత్తాన!
ఆయన ఉంటేనే అన్ని…అని
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు వృద్ధుడు నొక్కొ చెప్పారు.