Monday, December 23, 2024

మెడికల్ కాలేజీ తెచ్చుకోలేని దద్దమ్మ బండి: ఎర్రబెల్లి

- Advertisement -
- Advertisement -

 

జనగామ: మునుగోడు ప్రజలు బిజెపికి, కేంద్ర ప్రభుత్వనికి బుద్ధి చెప్పడంతో పాటు చెప్పుతో కొట్టినట్లు తీర్పునిచ్చారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివ్రుద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు  తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికలో టిఆర్ఎస్ పార్టీ విజయం సాధించడంపై మంగళవారం జనగామ టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపి బండి సంజయ్ అమిత్ షా చెప్పులు మోసాడు కాబట్టే ఢిల్లీ వరకు తెలిసేటట్లు మునుగోడు ప్రజలు చెప్పుతో కొట్టారని ఎర్రబెల్లి విమర్శలు గుప్పించారు. బిజెపి రాజగోపాల్ రెడ్డిని 18 వేల కోట్లకు కొని ఆయనను బలి పశువును చేసిందని చురకలంటించారు. హైదరాబాద్ లో ఎన్నికల కోసం భాగ్యలక్ష్మి టెంపుల్ ను, వరంగల్ ఎన్నికల కోసం భద్రకాళి ఆలయాన్ని, మునుగోడు ఎన్నికల కోసం యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని అడ్డు పెట్టుకొని బిజెపోళ్లు నాటకం ఆడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడు ప్రజలు వారి నాటకాలనికి తెరదించారని ప్రశంసించారు.

మునుగోడులో బిజెపి ఇచ్చిన హామీలను దేశం మొత్తం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆ మేరకు బిజెపి ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టి మాట్లాడాలని సూచించారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ తేలేని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సిగ్గు లేదని, కరీంనగర్ లో కనీసం ఒక్క మెడికల్ కాలేజీ తెచ్చుకోలేని దద్దమ్మ బండి సంజయ్ అని మండిపడ్డారు. బిజెపి ప్రభుత్వం అన్ని రంగాలను ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నదని, ధరలు పెరుగుదలకు ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వమేనని ఎర్రబెల్లి దుయ్యబట్టారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రాజగోపాల్ రెడ్డి ప్లాన్ చేసి తెలంగాణ లో చిచ్చు పెట్టడానికే ఈ ఎన్నికలు తెచ్చారని ధ్వజమెత్తారు.
చారిత్ర్రాత్మక తీర్పు ఇచ్చిన మునుగోడు ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని, అక్కరలేని ఎన్నిక తెచ్చిన బిజెపికి బుద్ధి చెప్పిన ప్రజలకు ధన్యవాదాలు అని అన్నారు. మునుగోడు ప్రజల గోడు వినని మూర్ఖులకు మంచి గుణపాఠం చెప్పిన ప్రజలకు ఎర్రబెల్లి కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News