Sunday, December 22, 2024

జెపిఎస్‌లను చర్చలకు పిలువలేదు: ఎర్రబెల్లి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జూనియర్ పంచాయతీ కార్యదర్శులను ప్రభుత్వం చర్చలకు పిలువలేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జెపిఎస్‌లను ప్రభుత్వం చర్చలకు పిలిచిందన్న ప్రచారం నిజం కాదన్నారు. నిబంధనలు, ఒప్పందాలకు విరుద్ధంగా చేస్తున్న సమ్మెను విరమించాలని ఎర్రబెల్లి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తరపున ఎవరూ జెపిఎస్‌లను చర్చలకు పిలవలేదని, ఇప్పటికైనా సమ్మె విరమిస్తే బాగుంటుందని సూచించారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌కు జెపిఎస్‌లపై మంచి అభిప్రాయం ఉందని, ప్రభుత్వాన్ని శాసించాలని అనుకోవడం పెద్ద తప్పు అని విమర్శించారు. జెపిఎస్‌లు సమ్మె విరమిస్తే సిఎం తప్పకుండా సాయం చేస్తారని, ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, వెంటనే జెపిఎస్‌లు సమ్మెను విరమించి విధుల్లో చేరాలని పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News