Thursday, January 23, 2025

ఎన్టీఆర్ కుమార్తె మహేశ్వరీ కన్నుమూత… పరామర్శించిన ఎర్రబెల్లి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ నాలుగో కుమార్తె కంఠమనేని ఉమా మహేశ్వరీ కన్నుమూయడంతో ఆమె కుటుంబాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించారు.  హైదారాబాద్ లోని జూబ్లీ హిల్స్ చెక్ పోస్టు సమీపంలో ఇంటికెళ్లి  ఉమా మహేశ్వరి కుటుంబం, ఆమె సోదరుడు హిందూపూర్ ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ, మోహనకృష్ణ తదితరులతో మాట్లాడి వారిని ఓదార్చారు.

దివంగత మాజీ ముఖ్యమంత్రి నాలుగో కుమార్తె కన్నుమూయడంతో తెలుగు ప్రజలు తీవ్ర విషాదంలోకి వెళ్ళారని,  నందమూరి ఫ్యాన్స్ ఆవేదన చెందుతున్నారని బాధను వ్యక్తం చేశారు. ఇటీవలే ఉమామహేశ్వరి చిన్న కుమార్తెకు వివాహం జరిగిందని, శుభకార్యం జరిగిన కొద్ది రోజులకే ఆ ఇంట విషాదం అలుముకోడం బాధాకరమైన విషయమన్నారు. ఎన్టిఆర్ కుటుంబంతో నాకు 40 ఏళ్లకు పైగా అనుబంధం ఉందని, వారి కుటుంబ సభ్యులంతా తనకు కుటుంబ సభ్యులేనన్నారు. ఆమె ఆత్మ శాంతించాలని, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపంతో పాటు సానుభూతిని ఎర్రబెల్లి తెలిపారు.  మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెంట తెలంగాణ ప్రతినిధి వేణుగోపాల చారి, తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News