Thursday, December 26, 2024

‘బలగం’ యూనిట్ కు మంత్రుల అభినందనలు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు బలగం చిత్రం ప్రతిబింబంగా ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, శంకర్‌నాయక్‌తో కలిసి బలగం చిత్రాన్ని ఆయన వీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి దయాకర్‌రావు మాట్లాడుతూ.. సకుటుంబ సపరివార సమేతంగా అందరూ కలిసి చూడాల్సిన మంచి సినిమాగా ఆయన అభివర్ణించారు. చాలా రోజుల తర్వాత తాను పూర్తి నిడివి సినిమా మొత్తాన్ని చూశానని చెప్పారు.

సినిమా చూస్తున్నంత సేపు తనకు గ్రామీణ ప్రాంత కుటుంబాల సామాజిక చిత్రణ గుర్తుకు వచ్చిందని, సినిమాలో చూపించిన పలు అంశాలను మంత్రి ఊటంకించారు. తెలంగాణ ప్రజల సంస్కృతి సంప్రదాయాలను బలగం సినిమా ద్వారా చిత్ర దర్శకుడు వేణు గొప్పగా చూపించారని మంత్రి అన్నారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్టీఆర్ నుంచి ఇప్పటి వరకు సినిమా ఇండస్ట్రీలో సత్సంబంధాలు ఉన్నాయని చెప్పారు.

సినిమా అంటే కొన్ని ఫైట్లు, మరికొన్ని పాటలు కొంత డ్రామా మరికొంత సెంటిమెంటు ఏవో కొన్ని సీన్లతో నిండి ఉంటాయని, కానీ బలగం సినిమాలో ఆద్యంతం ప్రేక్షకులను కట్టి పడేసే విధంగా ఉందన్నారు. చిత్రకధాంశం చిత్రీకరణ నేపథ్యం కెమెరా పనితనం నటీనటుల సాంకేతిక వర్గ పనితనం ఉన్నాయని మంత్రి ఎర్రబెల్లి చిత్ర యూనిట్ ని అభినందించారు. ఇలాంటి గొప్ప సినిమాలు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. కార్యక్రమంలో చిత్ర నిర్మాతలు, దర్శకుడు, హీరో ఇతర నటీనటులు సాంకేతిక వర్గం పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News