Wednesday, January 22, 2025

జగపతిబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ఎర్రబెల్లి..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సీనియర్ సినిమా నటుడు జగపతిబాబు పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శనివారం ఉదయం హైదారాబాద్ లోని ఆయన ఇంటికి వెళ్ళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జగపతి బాబు హీరోగా, విలన్ గా, తన గొప్ప నటనతో సినీ ప్రేక్షకులతో అనుబంధాన్ని, అనేక మంది అభిమానులను సంపాదించుకున్నారు. ప్రత్యేకించి మహిళలు జగపతిబాబును బాగా అభిమానిస్తారు. ఆయన ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలన్నారు. సుదీర్ఘంగా సినిమాల్లో నటిస్తూ మరింత గొప్ప పేరు తెచ్చుకోవాలని ఆశీస్తున్నట్లు తెలిపారు. ఆయనకు మరిన్ని అవార్డులు, రివార్డులు రావాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. తన చిరకాల మిత్రునికి మరోమారు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నాని మంత్రి ఎర్రబెల్లి అన్నారు.

Errabelli Dayakar Rao birthday wishes to Jagapathi babu

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News