Sunday, December 22, 2024

ప్రణీత్ రావు ఎవరో నాకు తెలియదు: ఎర్రబెల్లి

- Advertisement -
- Advertisement -

వరంగల్: ఎస్‌ఐబి మాజీ డిఎస్‌పి ప్రణీత్ రావు ఎవరో తనకు తెలియదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. మంగళవారం ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడారు. తన పేరు చెప్పాలని ప్రణీత్ రావు మీద పోలీసులు, ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తుందని ఆరోపణలు చేశారు. తనకు ఫోన్ ట్యాపింగ్ తెలియదని, వార్ రూమ్ కూడా తెలియదని ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్‌తో తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు. తన రాజకీయ జీవితంలో ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశానని, తనకు పార్టీ మారే ఉద్దేశం లేదని ఎర్రబెల్లి స్పష్టం చేశారు. బిజినెస్, ల్యాండ్ దందాలు, తప్పుడు పనులు చేసేవారే పార్టీలు మారుతున్నారని ధ్వజమెత్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News