Sunday, December 22, 2024

గత ఎన్నికల్లో గుండు.. ఈసారి పేరు…

- Advertisement -
- Advertisement -

మంత్రి ఎర్రబెల్లిపై వీరాభిమానం
మనతెలంగాణ/వరంగల్ ప్రత్యేక ప్రతినిధి : ఎన్నికలు అంటేనే చిత్ర విచిత్రాలు. నేతలపై అభిమానాన్ని ఒక్కోచోట ఒక్కోరకంగా అభిమాను లు చాటుతూ ప్రత్యేకతను నిలుపుకుంటారు. మంత్రి ఎర్రబెల్లికి ఉండే ఫాలోవర్స్ అయితే మరీ వినూత్నం. వరంగల్ జిల్లాలోని ఒక అభిమా ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై తనదైన రీతిలో అభిమానం కనబర్చారు. పాలకుర్తి నియోజకవర్గంలోని రాయపర్తి మండలం సన్నూ రు గ్రామానికి చెందిన చీకటి రవి అనే వ్యక్తి తన గుండుపై దయన్న అనే పేరు చెక్కించుకున్నారు. రోజువారి కూలీ చేసుకునే రవి… మంత్రిపై అభిమానంతో ఇలా చేయడం చర్చనీయాంశం అయింది. రాయపర్తి మండలం సన్నూరు గ్రామానికి చెందిన చీకటి వెంకన్నకు ఏడుగురు సంతానం. వీరిలో నలుగురు అమ్మాయిలు అయితే, ముగ్గు రు అబ్బాయిలు ఉన్నారు.

అందరికీ పెళ్లిళ్లు పూర్తయి వివిధ చోట్ల స్థిరపడ్డారు. ముగ్గురు కుమారుల్లో ఇద్దరు హైదారాబాద్ లో కూలీ పనిచేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. మూడో వాడైన చీకటి రవి ఇంటి వద్దనే ఉంటూ స్థానికంగా, తొర్రూరులో తాపీ మేస్త్రి పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. 1983లో తెలుగుదేశం ఆవిర్భావం అయినప్పటి నుంచి చీకటి రవి తండ్రి వెంకన్న టిడిపి కి హార్డ్ కోర్ కార్యకర్త. వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి మూడుసార్లు టిడిపి ఎమ్మెల్యేగా గెలిచిన ఎర్రబెల్లికి ఫాలోవర్ ఉన్నారు. వెంకన్న కుటుంబమంతా తొలినుంచి ఎర్రబెల్లితోనే ఉంటున్నది. అయితే 2009లో డిలిమిటేషన్ తర్వాత ఎర్రబెల్లి జనరల్‌గా మారిన పాలకుర్తికి మారారు. ఇదే నియోజకవర్గంలోకి రాయపర్తి మండలం చేరింది.

తొలినుంచి ఉన్నట్లుగానే వీళ్ల ఫ్యామిలీ ఎర్రబెల్లికి తోడుగా ఉంది. అదే కుటుంబానికి చెందిన రవికి ఎర్రబెల్లి అంటే ఎంతో అభిమానం. ఈ సారి ఎన్నికల ప్రచారం సాగుతున్న క్రమంలో దయన్న పేరును నెత్తికి చెక్కించుకోవడం చర్చనీయాంశం అయింది. 2014లో జరిగిన శాసనసభ ఎన్నికల సమయం లో కూడా చీకటి రవి గుండు చేయించుకుని ప్రత్యేక అభిమానం చాటారు. తనకు ఓటు హక్కు లభించినప్పటి నుంచి ఎర్రబెల్లి దయాకర్ రావుకు మాత్రమే ఓటు వేస్తున్నానని చీకటి రవి తెలిపారు. దయ న్న అంటే ఎంతో ఇష్టమని పేర్కొన్నారు. దయన్న గెలుపే లక్ష్యంగా పార్టీలో పనిచేస్తానని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News