Sunday, April 6, 2025

అమిత్ షాపై మంత్రి ఎర్రబెల్లి ఫైర్..

- Advertisement -
- Advertisement -

వరంగల్‌: కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా మాటలన్నీ అబద్ధాలేనని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు మండిపడ్డారు. ఆదివారం ఉదయం వరంగల్‌లో ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌ రెడ్డి, చల్లా ధర్మారెడ్డితో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు మీడియాతో మాట్లాడారు. నిన్న తుక్కుగూడలో బిజెపి నిర్వహించిన బహిరంగ సభలో సిఎం కెసిఆర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలను మంత్రి ఎర్రబెల్లి ఖండించారు. ”తెలంగాణపై బిజెపికి ప్రేమ లేదని మరోసారి రుజువైంది. బిజెపి నాయకులు బ్లాక్ మెయిలర్స్.  బిజెపి ఇచ్చిన ఏ ఒక్క హామీనైనా అమలు చేసిందా?. ఏ హామీ నెరవేర్చారో చెప్పాలి. తెరాస ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చింది. మేనిఫెస్టోలో చెప్పినవే కాదు చెప్పనివి కూడా చేసింది. కేంద్రం నీచమైన కుట్రలతో రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తోంది. బండి సంజయ్ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడు.కేంద్రం తెలంగాణకు ఒక్క మెడికల్‌ కాలేజీ కూడా ఇవ్వలేదు. పసుపు బోర్డు ఏమైందో బీజేపీ నేతలు చెప్పాలి” అని మంత్రి ఎర్రబెల్లి డిమాండ్ చేశారు.

Errabelli Dayakar rao Fires on Amit Shah

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News