Friday, December 20, 2024

నాకు ఓటేస్తేనే ఉద్యోగం ఇప్పిస్తా: ఎర్రబెల్లి

- Advertisement -
- Advertisement -

తనకు ఓటేసినోళ్లకే ఉద్యోగం ఇప్పిస్తానంటూ బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. గతంలో తాను వర్ధన్నపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అందరికీ ఉద్యోగాలు ఇప్పించానని, ఈసారి మాత్రం తనకు ఓటు వేస్తేనే ఉద్యోగం ఇప్పిస్తానని అన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తల పిల్లలకు కూడా ఉద్యోగాలు వేయిస్తానన్నారు. జనగామ జిల్లా పాలకుర్తిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎర్రబెల్లి ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రచారంలో తనతో పాల్గొన్నవారికే ఉద్యోగాలు ఇప్పిస్తానని ఆయన అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News