Sunday, December 22, 2024

సమ్మక్క సారలమ్మ సన్నిధిలో మంత్రి ఎర్రబెల్లి

- Advertisement -
- Advertisement -

సారలమ్మను దర్శించుకున్న మంత్రి

మనతెలంగాణ/ములుగు జిల్లా ప్రతినిధి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా  తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క సారలమ్మ వన దేవతలను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు గురువారం దర్శించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ కోరిక కోర్కెలు తీర్చే వన దేవతలను దర్శించుకోవడం సంతోషకరమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సమ్మక్క సారలమ్మల దీవెనలతో అభివృద్ధి పథంలో నిలుపుతున్న ముఖ్యమంత్రి కెసిఆర్ కు అమ్మల కృప ఉండాలని కోరుకున్నానన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ తన ఎత్తు బంగారాన్ని అమ్మలకు సమర్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News