Sunday, December 22, 2024

రైతురుణ మాఫీ పూర్తి కాకుండా కాంగ్రెస్ అడ్డుపడుతుంది: ఎర్రబెల్లి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పాలకుర్తిలో రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేశామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. పాలకుర్తిలో రూ.10 కోట్లతో సేవాలాల్ భవన్ కట్టిస్తున్నామని, పాలకుర్తి సోమేశ్వర ఆలయం అద్బుతంగా తీర్చిదిద్దామని, రూ.25 కోట్లతో బమ్మెర పోతన సమాధిని అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. పాలకుర్తిలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఎర్రబెల్లి ప్రసంగించారు. ప్రతి గ్రామంలో రెండు ఎకరాలు కొని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించామని, సిఎం కెసిఆర్ తొర్రూరును మున్సిపాలిటీ చేశారని గుర్తు చేశారు. రైతురుణ మాఫీ పూర్తి కాకుండా కాంగ్రెస్ అడ్డుపడుతుందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తుందని దుయ్యబట్టారు. సిఎం కెసిఆర్‌ను మూడోసారి ముఖ్యమంత్రిని చేయాలని ఎర్రబెల్లి కోరారు. పది వేల మందికి కోచింగ్ ఇప్పించి ఉద్యోగాలు ఇప్పించానని ఆయన చెప్పారు. పాలకుర్తికి ఇంజనీరింగ్ కాలేజ్, రెవెన్యూ డివిజన్ కావాలన్నారు. సంచార జాతులు, జానపద కళాకారులకు గుర్తింపు కార్డులు కావాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News