Sunday, December 22, 2024

మిషన్ భగీరథకు నిధులు ఇస్తామని కేంద్రం మోసం చేసింది: ఎర్రబెల్లి

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: మిషన్ భగీరథకు నిధులు ఇస్తామని కేంద్రం ఇవ్వకుండా మోసం చేసిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సోమవారం నాలుగు జిల్లాలకు తాగు నిరందించే ట్రయల్ రన్ నిర్వహణలో భాగంగా మంగోల్ లో నిర్మించిన వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ను మంత్రులు హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకరరావులు పరుశీలించారు. ఈ కార్యక్రమంలో సీఎం ఓఎస్డీ స్మిత సబర్వాల్, కలెక్టర్ ప్రాశాంత్ జీవన్ పాటిల్, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

అనంతరం మీడియాతో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ”రూ.1212 కోట్లతో తాగునీటి వసతి చేపట్టాము.దీంతో 1900 అవాసలకు, 9 నియోజకవర్గాలోని 16 మున్సిపాలిటీలకు తాగునీరు అందనుంది. మిషన్ భగీరథ దేశంలోనే తెలంగాణకు మకుటాయమానంగా నిలుస్తోంది. ఈ విషయాన్ని కేంద్రమే పార్లమెంట్ లో ఖితాబివ్వడమే కాకుండా చాలా అవార్డులు ఇచ్చింది. తెలంగాణను చూసి నేర్చుకోవాలని ఇతర రాష్ట్రాలకు కూడా చెప్పింది. కానీ తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరించదు. మన పథకాలను కేంద్రం కాపీ కొడుతున్నది” అని పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News