Thursday, January 23, 2025

కాంగ్రెస్ సభ అట్టర్ ప్లాప్ అవుతుంది: ఎర్రబెల్లి

- Advertisement -
- Advertisement -

Errabelli Dayakar Rao reacts on Congress Warangal Sabha

హైదరాబాద్: వరంగల్ లో కాంగ్రెస్ సభ అట్టర్ ప్లాప్ అవుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మే 6న వరంగల్ లో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున రైతు సంఘర్షణ సభ నిర్వహించనుంది. ఈ సభకు రాహుల్ గాంధీ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో శనివారం మంత్రి ఎర్రబెల్లి వరంగల్ కాంగ్రెస్ సభపై స్పందించారు. ”రైతుల ఆత్మహత్యలకు ఎవరో కరణమో ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం మాట్లాడుతున్న కుక్కలకు మేము సమాధానం చెప్పము. గతంలో నీళ్లు లేక రైతుల పొలాలు ఎండిపోయే పరిస్థితి ఉండేది. దేశంలో రైతుల ఆత్మహత్యలో తెలంగాణ రెండో స్థానంలో ఉందంటున్న కాంగ్రెస్ పార్టీ నేతలకు దమ్ము ఉంటే లెక్కలు బయటకు తీయాలి. రైతు సంఘర్షణ కాదు.. పనికి మాలిన పార్టీల ఘర్షణ” అని ఎర్రబెల్లి విమర్శించారు.

Errabelli Dayakar Rao reacts on Congress Warangal Sabha

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News