Monday, December 23, 2024

పీయూష్ గోయల్ తెలంగాణ ప్రజలను కించపరిచారు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ ప్రజలను నూకలు తినమనండి అనే రీతిలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ మాట్లాడి అవమాన పరిచారని మంత్రి ఎర్ర బెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. శుక్రవారం తెలంగాణ భవన్ లో మీడియాతో మంత్రి మాట్లాడుతూ.. ”నిన్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ ప్రజలను కించపరిచేలా మాట్లాడారు. పీయూష్ కు ఇక్కడి బీజేపీ నేతలు, తెలంగాణ ప్రజలు బుద్ది చెప్పాలి. బీజేపీ నేతలు సిగ్గు లేకుండా కేంద్రానికి వంత పాడే ధోరణి మానాలి. నలుగురు బీజేపీ ఎంపీలు తెలంగాణ నుంచి ఉన్నా ఏం లాభం. తెలంగాణలో వ్యవసాయం రూపు రేఖలు గతంలోకి ఇప్పటికీ మారిపోయాయంటే అది కేసీఆర్ చలవే. ఇంజినీర్లు, సాఫ్ట్ వేర్ నిపుణులు కూడా వ్యవసాయం వైపు మొగ్గుతున్నారంటే కేసీఆర్ తెలంగాణ రైతు అనుకూల విధానాలే కారణం. తెలంగాణ రైతుల కోసం చేస్తున్న మేలులో కేంద్రం ప్రమేయం ఏమైనా ఉందా?. పట్టణాల నుంచి పల్లెలకు ప్రజలు వలసలు పోయే పరిస్థితి నెలకొంది. దమ్ముంటే తెలంగాణ ప్రభుత్వం రైతులకేమి చేసిందో తేల్చుకోవడానికి పీయూష్ గోయల్ హైద్రాబాద్ కు చర్చకు రావాలి. ఎవరు నూకల బియ్యం తింటారో తేల్చుకుందాం. కేంద్రం రైతులకేమి చేసిందో, తెలంగాణ ఏమి చేసిందో తేల్చుకుందాం. పీయూష్ గోయల్ సిగ్గు లేకుండా కేసీఆర్ ను తెలంగాణ వ్యతిరేకి అంటున్నాడు. ఒకప్పుడు నేను కూడా వ్యవసాయం కోసం ఏడు బోర్లు వేసి అలసిపోయాను. వ్యవసాయమే మానుకుందామనుకుంటే కేసీఆర్ విధానాల ఫలితంగా నీళ్లు వచ్చాయి.. మళ్లీ వ్యవసాయానికి వైభవం వచ్చింది. మా నాన్న బతికుంటే కేసీఆర్ విధానాలతో బతికిన వ్యవసాయం చూసి సంతోషించేవారు. బాయిల్డ్ రైస్ కు ముడి బియ్యానికి తేడా తెలియని మూర్ఖులు బీజేపీ నేతలు… తెలంగాణ సోయి వారికి ఏ మాత్రం లేదు. ఇజ్జత్ లేకుండా మాట్లాడుతున్న బీజేపీ నేతలను గ్రామాల నుంచి ఢిల్లీకి తరమాలి.
వడ్లు కొనిపించేదాక వారిని గ్రామాల్లో అడుగు పెట్టనివ్వొద్దు. యాసంగి ధాన్యం కేసీఆర్ కొనకుంటే కేంద్రంతో కొనిపిస్తామని బండి సంజయ్ మాట్లాడాడు. ఇపుడు మాట తప్పి మరోలా మాట్లాడుతున్నాడు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకు సిగ్గుండాలి..సీఎం కేసీఆర్ ను ధాన్యం కొనమని సిగ్గు లేకుండా బండి సంజయ్ లేఖ రాశారు. వ్యవసాయ చట్టాలపై రైతులు కేంద్రం మెడలు వంచినట్టే తెలంగాణ రైతులు ఏకమై ధాన్యం కొనేదాకా ఉద్యమిస్తారు” అని పేర్కొన్నారు.

Errabelli Dayakar Rao slams Piyush Goyal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News