Thursday, January 23, 2025

వైద్యానికి సిఎం కెసిఆర్ పెద్ద పీట: ఎర్రబెల్లి

- Advertisement -
- Advertisement -

ములుగు:  తెలంగాణ ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు రాష్ట్రంలో వైద్యానికి సిఎం కెసిఆర్ పెద్ద పీట వేశారని మంత్రి దయాకర్‌ రావు అన్నారు. బుధవారం జిల్లాలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమాలను గిరిజన పర్యటన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆధ్వర్యంలో కార్యక్రమాలను ఏర్పాటు చేయగా, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఐటిశాఖ మంత్రి కెటిఆర్, హోంశాఖ మంత్రి మహమ్మద్ అలీ, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు, ఎంపి మాలోతు కవితలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్యం అందించడంతో పాటు గర్భిణీ, బాలింతలకు, పుట్టిన పిల్లలకు ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఆసుపత్రుల నిర్మానానికి వేల కోట్లు నిధులు కేటాయించి, ప్రత్యేక వైద్యులను నియమించి పేద ప్రజలకు నాణ్యమైన ఉచిత వైద్యం అందిస్తున్న ఘనత బిఆర్‌ఎస్‌కే దక్కుతుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News