Saturday, December 21, 2024

మనసున్న మారాజు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

- Advertisement -
- Advertisement -

తొర్రూరు : జర్నలిస్టుల సొంతింటి కల నెరవేర్చిన గొప్ప మనసున్న మారాజు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అని ఐజేయూ జాతీయ కౌన్సిల్ సభ్యులు దూలం శ్రీనివాస్, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు నాగపురి అశోక్‌గౌడ్, జలగం శేఖర్‌లు అన్నారు. తొర్రూరులో జర్నలిస్టులకు డబుల్ బెడ్రూం ఇండ్లు కెటాయించడాన్ని హర్షిస్తూ సోమవారం జర్నలిస్టుల ఆధ్వర్యంలో డివిజన్ కేంద్రంలోని గాంధీ విగ్రహం ఎదుట సీఎం కేసీఆర్, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.

అనంతరం వారు మాట్లాడుతూ జర్నలిస్టుల స్థితిగతులు గుర్తించి వారి బతుకులు బాగుపడాలని మనస్ఫూర్తిగా కోరుకున్న మనసున్న మారాజు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అని చెప్పారు. నియోజకవర్గంలోని ప్రతీ మండలంలో జర్నలిస్టులకు ఇండ్లు కెటాయించిన ఘనత మంత్రిదయాకర్‌రావుకే దక్కుతుందన్నారు. తొలి దశలో నలబై మందికి కెటాయించగా రెండవ విడతలో మరికొంత మందికి ఇండ్లు రానున్నాయని ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. సీఎం కేసీఆర్ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రూ.వంద కోట్లతో జర్నలిస్టుల సంక్షేమానికి నిధి ఏర్పాటు చేశారని చెప్పారు.

ఇప్పటి వరకు 456 మంది జర్నలిస్టులు మరణించగా వారి కుటుంబాలకు ఒకొకరికి రూ.లక్షత పాటు ప్రతీ నెల రూ.మూడువేల పింఛన్‌ను ఐదేళ్ల పాటు ఇస్తునందని తెలిపారు. మరణించిన జర్నలిస్టుల పిల్లలు చదువుకోవడానికి ఎల్‌కేజీ నుండి పదవ తరగతి వరకు నెల నెలా రూ.వెయ్యి ట్యూషన్ ఫీజు చెల్లిస్తుందని తెలిపారు. తీవ్ర అనారోగ్యం, ప్రమాద బారిన పడిన జర్నలిస్టు పని చేయలేని స్థితిలో ఉంటే రూ.యాబై వేల ఆర్థిక సహాయాన్ని అకాడమీ ద్వారా ప్రభుత్వం అందజేస్తుందని చెప్పారు. జర్నలిస్టులు ఏదైన కారణంతో మరణిస్తే వారి కుటుంబాలను ఆదుకునే మానవీయ కార్యక్రమానికి స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రూపకల్పన చేశారని గుర్తు చేశారు. జర్నలిస్టుల సొంతింటి కలను నెరవేర్చిన మంత్రి దయాకర్‌రావుకు రుణపడి ఉంటామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో జర్నలిస్టు నాయకులు దేవరకొండ కృష్ణప్రసాద్, బిజ్జాల వెంకటరమణ, నారాయణరాజు, ఆడెం కృష్ణ, లకావత్ యాదగిరినాయక్, తాటికొండ సదాశివరావు, శ్రీనివాస్, మేరుగు రమేశ్‌గౌడ్, చౌడవరపు రాము, ఇమ్మడి రాంబాబు, అశోక్‌రెడ్డి, సాంబశివ, యాకన్న, శ్రీకాంత్, శంకర్, ఏకాంతం, శ్రీకాంత్, కృష్ణ, రాంమూర్తి, రవి, వీరన్న, మహేశ్, భాస్కర్, సుమంత్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News