Wednesday, January 22, 2025

గట్టమ్మ తల్లి దేవాలయాన్ని సందర్శించిన మంత్రి ఎర్రబెల్లి..

- Advertisement -
- Advertisement -

Errabelli Dayakar Rao Visit Gattamma Thalli Temple

ములుగు: మేడారం గ్రామంలోని సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లను పరిశీలించేందుకు వెళ్తూ మార్గమధ్యలో ములుగు సమీపంలో ఉన్న శ్రీ గట్టమ్మ తల్లి దేవాలయాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు భారీ సంఖ్యలో భక్తులకు తరిలివస్తున్నారని, ఈ నేపథ్యంలో అక్కడ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.75 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. కాగా, మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర ఈ నెల 16 నుంచి 19వ తేదీ వరకు జరగనుంది.

Errabelli Dayakar Rao Visit Gattamma Thalli Temple

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News