Sunday, December 22, 2024

ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని పరామర్శించిన మంత్రి ఎర్రబెల్లి..

- Advertisement -
- Advertisement -

Errabelli Dayakar Rao visit to Armoor MLA Jeevan Reddy

మనతెలంగాణ/హైదరాబాద్: పీయూసీ చైర్మన్, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఖండించారు. బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లిన మంత్రి, జీవన్‌రెడ్డిని, ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. ఘటనకు సంబంధించిన పూర్వాపరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు చోటు లేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. నిందితుడిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యంగా ఉండాలన్నారు.

Errabelli Dayakar Rao visit to Armoor MLA Jeevan Reddy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News