Sunday, December 22, 2024

యాదాద్రిని ప్రఖ్యాత ఆలయంగా తీర్చిదిద్దారు: మంత్రి ఎర్రబెల్లి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: యాదాద్రి ఆలయాన్ని ప్రపంచ ప్రఖ్యాత ఆలయంగా ముఖ్యమంత్రి కెసిఆర్ తీర్చిదిద్దారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. బుధవారం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని మంత్రి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి మా ఇలవేల్పు అన్నారు.

గతంలో యాదాద్రికి వచ్చిన వారు ఇప్పుడు వస్తే.. యాదాద్రి కేనా వచ్చింది అన్నంత అభివృద్ధి జరిగిందన్నారు. మహిమాన్వితమైన ఈ దేవాలయాన్ని సందర్శించే భక్తులకు ఈ ఆలయ ప్రాంగణంలోనే సకల సదుపాయాలు కల్పించారని చెప్పారు. సిఎం కెసిఆర్ దార్శనికతతో రాష్ట్రం అన్ని రంగాల్లో మరింతగా అభివృద్ధి చెందాలని ఆ దేవుడిని ప్రార్థించానని మంత్రి చెప్పారు. ఆ దేవుడు ఆశీస్సులతో ప్రజలంతా సుఖ శాంతులతో ఉండాలని కోరుకున్నాను అని మంత్రి తెలిపారు. సిఎం కెసిఆర్ స్ఫూర్తితో తాను తన పాలకుర్తి నియోజకవర్గంలోని పలు దేవాలయాలను అభివృద్ధి పరుస్తున్నట్లుగా చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News