Monday, December 23, 2024

రోడ్డు ప్రమాదం… సహాయం చేసిన ఎర్రబెల్లి

- Advertisement -
హైదరాబాద్: సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలో  విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ వైపు వస్తున్న బైక్ ను వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో ఒకరు దుర్మరణం చెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అదే సమయంలో రోడ్డు ప్రమాదాన్ని గమనించి కారు ఆపారు. ఎర్రబెల్లి అంబులెన్స్ కు కాల్ చేసి క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. పాలకుర్తి నియోజకవర్గ పర్యటన ముగించుకొని మేళ్ళ చెరువు వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినప్పుడు ఎర్రబెల్లి అక్కడే ఉన్నారు.
జిల్లా కలెక్టర్, ఎస్పి ఇతర అధికారులకు ఫోన్ చేసి మాట్లాడారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. అక్కడకు చేరుకున్న పోలీసులతో కలిసి అక్కడే ఉండి ట్రాఫిక్ ను క్లియర్ చేయించారు. జరిగిన విషాద ఘటన పట్ల ఎర్రబెల్లి విచారం వ్యక్తం చేశారు. వెంటనే ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరిపి ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా జాగ్రత్త వహించాలని అధికారులను ఆదేశించారు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News