వరంగల్: కేంద్రం ప్రభుత్వం యాసంగి వడ్లను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని వరంగల్-ఖమ్మం ప్రధాన రహదారిలో గల రాయపర్తి చౌ రస్తా వద్ద చేపట్టిన టీఆర్ఎస్ ధర్నాలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పాల్గొన్నారు. ఈ ధర్నాలో టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొని కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని, యాసంగి వడ్లను కొనేవరకు ఆందోళనలు చేపడుతామని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. తెలంగాణ రైతులు పండించిన యాసంగి వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొంటుందా? కొనదా? స్పష్టం చేయాలన్నారు. పంజాబ్ రైతుల వద్ద వరి ధాన్యం కొంటూ.. తెలంగాణ రైతుల వద్ద ధాన్యం ఎందుకు కొనరు, ఇదెక్కడి న్యాయం? అని ప్రశ్నించారు. తెలంగాణలోని పలు అన్ని జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్దఎత్తున టిఆర్ఎస్ ధర్నాలో పాల్గొంటున్నారు.
Errabelli Protest against Central Govt in Warangal