Sunday, December 22, 2024

పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి పనులు వేగవంతం చేయాలి..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి పనులపై సోమవారం ఎర్రమంజిల్ లోని మిషన్ భగీరథ కార్యాలయంలో రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మహబూబ్ నగర్ జిల్లా మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయాలని మంత్రులు అధికారులను ఆదేశించారు.కరోనా నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను మరింత పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. ఉపాధి హామీ నిధులను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని, పల్లె ప్రగతిని నిరంతరం నిర్వహిచాలని చెప్పారు. గతం లాగే ఈసారి కూడా కరోనా నియంత్రణకు అన్ని విధాలుగా పంచాయతీ రాజ్ శాఖ సిబ్బంది ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పని చేయాలని మంత్రుల చెప్పారు.

Errabelli Review on Panchayat Raj development work

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News