Wednesday, January 22, 2025

రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు: ఎర్రబెల్లి

- Advertisement -
- Advertisement -

దేశానికి కొత్త క్రాంతి ఇచ్చే పార్టీ బి.ఆర్.ఎస్, టి.ఆర్.ఎస్ తో దక్షిణాయనం పూర్తి…
బి.ఆర్.ఎస్ తో ఉత్తరాయణం మొదలు

సంక్రాంతితో రాష్ట్రం నుంచి దేశం వైపు గమనం

18న ఉత్తరాయణం చేసేందుకు ఖమ్మం నుంచి బి.ఆర్.ఎస్ తొలి అడుగు

తెలుగు ప్రజలు గర్వించే నూతన గమనానికి ఖమ్మం గుమ్మం నుంచి ఆరంభం

రైతు పండగ సంక్రాంతి నుంచి రైతు రాజ్యం లక్ష్యంగా భారత రైతు సంక్షేమం కోసం బి.ఆర్.ఎస్ ప్రస్థానం

హైదరాబాద్: టి.ఆర్.ఎస్ పార్టీతో దక్షిణ భారతంలో అభివృద్ధికి అర్ధం చెప్పి, ఉత్తర భారతంలో ఉదయించే సూర్యుడిగా అవతరించిన బి.ఆర్.ఎస్ పార్టీ, దేశంలో రైతు సర్కారును తీసుకురానున్న సందర్భంగా రాష్ట్ర, దేశ ప్రజలకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ నెల 18వ తేదీన ఖమ్మం గుమ్మం నుంచి భారత రైతు సంక్షేమ లక్ష్యంగా జరగనున్న బి.ఆర్.ఎస్ పార్టీ తొలి భారీ బహిరంగ సభను విజయవంతం చేసి దేశంలో కొత్త క్రాంతి తీసుకురావడానికి తెలుగు ప్రజలు శ్రీకారం చుట్టాలని ఎర్రబెల్లి పిలుపునిచ్చారు. తెలుగు తేజం, మన ఠివి పివి ప్రధానిగా దేశాన్ని పాలించి తెలంగాణ సత్తా చాటిన గడ్డ నుంచి భారత దేశ భవిష్యత్ తీర్చిదిద్దడానికి, భారత రూపు రేఖలు మార్చి, రైతు రాజ్యాన్ని తెచ్చే సంకల్పంతో బి.ఆర్.ఎస్ ఆవిర్భవించడం పట్ల తెలుగు ప్రజలు గర్వించాలన్నారు. పంటలు ఇంటికి వచ్చి రైతులు సంతోషంగా ఇంటిల్లిపాది సంబరం చేసుకునే పండుగ సంక్రాంతి అని, ఆ తరవాత ఈనెల 18 నుంచి నుంచి రైతు రాజ్యం కోసం తొలి అడుగుగా సభ పెట్టడం శుభారంభమన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతు ఈ దేశాన్ని శాసించాలి అన్న సంకల్పానికి ప్రజలంతా ఆశీస్సులు అందించాలని ఎర్రబెల్లి కోరారు. మరోసారి ప్రజలకి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News