Thursday, January 23, 2025

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త పడాలి: ఎర్రబెల్లి

- Advertisement -
- Advertisement -

Errabelli tour in Jangaon

జనగామ: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, వరదలకు అతలాకుతలమైన పలు ప్రాంతాలలో తాజా పరిస్థితులు, పునరావాస కేంద్రాలకు ముంపు బాధితులను తరలించడంతో సీజనల్ వ్యాధుల నివారణ వంటి పలు అంశాల పై రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జనగామ కలెక్టరేట్ లో సమీక్షలు జరిపారు.

ఈ సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ఎర్రబెల్లి దిశా నిర్దేశం చేశారు. ఈ వానాకాలం మొత్తం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త వహించాలని సూచించారు. లోతట్టు ప్రాంతాలకు గుర్తించి ప్రజలను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. పునరావాస కేంద్రాలకు ముంపు బాధితులను తరలించడంతో పాటు సహాయక  చర్యలు చేపట్టాలన్నారు. వర్షాల తర్వాత సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త పడాలన్నారు.

ఈ మేరకు అన్ని శాఖలను సమన్వయం చేసుకోవాలని, ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి అని జిల్లా కలెక్టర్ శివ లింగయ్యకు మంత్రి అదేశించారు. వ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని త్రాగునీరు సరఫరా పారిశుధ్యం నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి సూచించారు.  ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు, జడ్ పి సిఇఒ, డిపిఒ, డిఎం అండ్ హెచ్ఒ, డిఆర్ డిఒ, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.  స్టేషన్ ఘన్ పూర్ మండలం సముద్రాలలో మంత్రి ఎర్రబెల్లి పర్యటించారు. ప్రజలతో మాట్లాడి తాజా పరిస్థితులు తెలుసుకున్నారు. ఇప్పగూడెంలో హరితహారంలో భాగంగా మంత్రి, ఎమ్మెల్యే రాజయ్య మొక్కలు నాటారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News