Saturday, December 21, 2024

ఎన్నో పోరాటాలకు మల్లు స్వరాజ్యం స్పూర్తి: ఎర్రబెల్లి

- Advertisement -
- Advertisement -

Errabelli Tribute to demise of Mallu Swarajyam

హైదరాబాద్‌: ఎన్నో పోరాటాలకు మల్లు స్వరాజ్యం స్పూర్తి అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలు, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం(91) కన్నుమూశారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న ఆమె బంజారాహిల్స్‌లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి 7.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. దీంతో ప్రజల సందర్శనార్థం ఆమె భౌతికకాయాన్ని హైదరాబాదులోని రాష్ట్ర కార్యాలయం ఎంబి భవన్‌ తరలించారు. ఈ నేపథ్యంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు ఎంబి భవన్‌ కు చేరుకుని మల్లు స్వరాజ్యం భౌతికకాయానికి నివాళులర్పించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ.. ఆమె మరణం పట్ల తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు. మరికొద్దిసేపట్లో నల్గొండ మెడికల్ కాలేజీకి ఆమె భౌతికకాయం తరలించనున్నారు. ఆ తర్వాత 12 గంటలకు నల్గొండలో సంతాపసభ నిర్వహించనున్నారు. అనంతరం నల్గొండ జిల్లా కేంద్రంలో మల్లు స్వరాజ్యం అంత్యక్రియలు నిర్వహించినున్నట్లు సిపిఎం నల్గొండ జిల్లా కార్యదర్శి ఎం.సుధాకర్‌రెడ్డి తెలిపారు.

Errabelli Tribute to demise of Mallu Swarajyam

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News