Friday, December 20, 2024

యాదాద్రిలో ఉత్తర ద్వార దర్శనం అదృష్టం: ఎర్రబెల్లి

- Advertisement -
- Advertisement -

యాదాద్రి: కొత్త సంవత్సరంలో తెలంగాణ ప్రజలకు శుభాలు జరగాలని సంతోషంగా ఉండాలని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని కోరుకున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ తన సతీమణి ఉషా దయాకర్ తో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు స్వామి వారిని దర్శించుకున్నారు. వేద పండితులు, ఆలయ అధికారులు, అర్చకులు మంత్రికి సాదర స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం వేద ఆశీర్వచనం ఇచ్చారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వములో తెలంగాణ ప్రజలకు 8 ఏళ్ల నుంచి శుభం జరుగుతుందన్నారు. రైతులు, సామాన్యులు, ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారని ప్రశంసించారు. అన్ని కార్యక్రమాల్లో, అభివృద్దిలో ముందుకు పోయామని, కేంద్రం సహకరించకపోయినా భగవంతుని ఆశీర్వాదంతో రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ముందుకు పోతుందని ఎర్రబెల్లి పేర్కొన్నారు. యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి ఆలయాన్ని బాగా అభివృద్ధి చేశామని, భక్తులు చాలా సంతోషంగా ఉన్నారని, చిన్న వసతులు పూర్తి అయితే ఇంకా బాగుంటుందని, ప్రజలు పెద్ద ఎత్తున వస్తున్నారని, తిరుపతితో సమానంగా అభివృద్ధి జరిగిందని ఎర్రబెల్లి తెలిపారు.

ప్రతి నూతన సంవత్సరం లక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకుంటానని, 40 ఏళ్ల నుంచి స్వామివారిని దర్శించుకుంటున్నానని ఎర్రబెల్లి గుర్తు చేశారు. ఏ కార్యక్రమం చేసినా స్వామి ఆశీర్వాదంతో మొదలు పెడుతానని, ఈరోజు ఈ దేవాలయ వైభవం చూశాక చాలా సంతోషం కలుగుతుందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. భక్తుల చిరకాల వాంఛ ఉత్తర ద్వార దర్శనం రేపటి నుంచి ప్రారంభం కావడం నిజంగా సంతోషమన్నారు. ఇందుకోసం కెసిఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు ఎర్రబెల్లి తెలిపారు. ఆలయంలో వసతులు ఎలా ఉన్నాయని భక్తులను అడిగి తెలుసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News