Friday, November 22, 2024

యాదాద్రి సేవలో ఎర్రబెల్లి

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని కుటుంబ సమేతంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దర్శించుకున్నారు.  ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మీడియాతో మాట్లాడారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామివారు మా ఇలవేల్పు అని అన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ తిరుగులేని విజయాన్ని సాధించిండంతో స్వామివారి కి పూజలు నిర్వహించడం జరిగిందని ఎర్రబెల్లి తెలిపారు. యాదాద్రి ఆలయాన్ని ప్రపంచ ప్రఖ్యాత ఆలయంగా ముఖ్యమంత్రి కెసిఆర్ తీర్చిదిద్దారని ప్రశంసించారు. గతంలో యాదాద్రి కి వచ్చిన వారు ఇప్పుడు వచ్చి చుస్తే యాదాద్రేనా అని అన్నట్టు సుందరంగా తీర్చిదిద్దారని ప్రశంసించారు.

 త్వరలోనే ముఖ్యమంత్రి కెసిఆర్, త్రిదండి చినజీయర్ స్వామి వారు ఈ ఆలయ ఉద్ఘాటన చేయనున్నారు. దేశ విదేశాల నుంచి ప్రధానులు, ముఖ్యమంత్రులు, పీఠాధిపతులు హాజరుకానున్నారని చెప్పారు. మహి మాన్వితమైన ఈ దేవాలయాన్ని సందర్శించే భక్తులకు ఈ ఆలయ ప్రాంగణంలోనే సకల సదుపాయాలు కల్పిస్తామని వివరించారు. సిఎం కెసిఆర్ దార్శనికత తో రాష్ట్రం అన్ని రంగాల్లో మరింతగా అభివృద్ధి చెందాలని ఆ దేవుడిని ప్రార్థించానని ఎర్రబెల్లి చెప్పారు. ఆ దేవుడు ఆశీస్సులతో ప్రజలంతా సుఖ శాంతులతో ఉండాలని కోరుకున్నాను అని మంత్రి తెలిపారు. అంతకు ముందు మంత్రికి ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. దర్శనానంతరం అర్చకులు మంత్రికి స్వామి వారి పట్టు వస్త్రాలతో ఆశీర్వచనం అందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News