Saturday, November 16, 2024

అరవింద్ నువ్వెంత ..నీ బతుకెంత?

- Advertisement -
- Advertisement -
మండిపడ్డ ఎర్రళ్ల శ్రీనివాస్

హైదరాబాద్ : బిజెపి నిజామాబాద్ ఎంపి ధర్మపురి అరవింద్‌పై తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌళిక వసతుల అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అరవింద్.. నువ్వెంత ..నీ బతుకెంత అని తీవ్రస్థాయిలో ఎర్రళ్ల శ్రీనివాస్ మండిపడ్డారు. శుక్రవారం సచివాలయం మీడియా పాయింట్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. బట్టేబాజ్ అల్ ఇండియా సంఘంకు బిజెపి ఎంపి ధర్మపురి అరవింద్‌ను జాతీయ అధ్యక్షుడిని చేస్తే బాగుంటుందన్నారు.

ఎన్నికల ముందు నిజామాబాద్‌కు పసుపు బోర్డ్ ఇస్తా అని బాండ్ పేపర్ రాసిచ్చారని, ఇప్పటికి పసుపు బోర్డ్ దిక్కు లేదన్నారు. నిజామాబాద్ ప్రజలకు నీవు ఎంపి అయ్యి ఏం చేశావొ చెబుతావా? అని నిలదీశారు. మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయని, మరీ పసుపు బోర్డ్ ఏది అని ప్రశ్నించారు. అందుకే వాన్ని బట్టేబాజ్ అంటారని, అతనిని ఆ సంఘంకు జాతీయ అధ్యక్షుడు చేయాలని అంటున్నానన్నారు.

దేశంలో 157 మెడికల్ కాలేజ్ లు ఇచ్చారని, ఒక్కటి అయిన తెలంగాణ రాష్ట్రానికి , నిజామాబాద్ కు కావాలని అడిగావా…..ఎందుకు అడగలేదో చెప్పాలన్నారు. రోడ్ల మీద తిరిగే బ్రోకర్ .. బిజెపి టికెట్ ఇస్తే యాక్సిడెంటల్ గా ఎంపివి అయ్యావు తప్ప గెలిచే సత్తా లేని వ్యక్తి వి నువ్వన్నారు. మంత్రి హరిశ్ రావు మీద మాట్లాడే వ్యక్తివా నివా….అంత దమ్ము ఉందా. హరీష్ రావు పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఉరికిచ్చి కొడుతారు ఒళ్ళు జాగ్రత్త బిడ్డా అరవింద్ అని ఎర్రళ్ల శ్రీనివాస్ హెచ్చరించారు. నాడు నేను పోను బిడ్డా సర్కర్ దవాఖానకు అనే సామెత నుండి నేడు నేను పోతా బిడ్డ సర్కారు దవాఖానకు అనే దగ్గరకు తెలంగాణ వచ్చిందన్నారు. వైద్య రంగంకు ముఖ్యమంత్రి కెసిఆర్ , హరీష్ రావు ఎంతో చేస్తున్నాడని, వైద్య ఆరోగ్య శాఖ పై పిచ్చి పిచ్చిగా మాట్లాడితే .. బిడ్డా తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు.
బోత్సపైనా మండిపాటు..
తెలంగాణ రాష్ట్రం పై ఎపి మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన కామెంట్లను తాను ఖండిస్తున్నానని ఎర్రళ్ల శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం పై మాట్లాడినప్పుడు కొంచం అయిన ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని బొత్స సత్యనారాయణను హెచ్చరించారు. బొత్స..నువ్వు ఇలానే మాట్లాడితే నిన్ను హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలో నిన్ను దిగనివ్వం జాగ్రత్త అని హెచ్చరించారు. బొత్స అధికారంలో ఉన్నప్పుడు ఎపిపిఎస్‌సి ..గబ్బు.. గబ్బు అంటూ నాడు వార్త పత్రికలు వార్తలు రాశాయని వాటి క్లిప్పింగ్‌లను ఎర్రళ్ల మీడియాకు చూపించారు. తెలంగాణ సమాజం పైన సిఎం కెసిఆర్‌పైన మంత్రులు కెటిఆర్, హరీష్ రావు పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు జాగ్రత్త బిడ్డా అని మంత్రి బొత్స సత్యనారాయణను హెచ్చరించారు. ఎపి ప్రభుత్వంలో ఇంజనీరింగ్ విద్య బాగాలేదని తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్య కోసం ఎపి విద్యార్థులు 80 వేల మంది ఇక్కడ చదువుతున్నారన్నారు. వారికి ఎపి రాజధాని ఏదో ఇప్పటికి దిక్కు లేదన్నారు. అందుకే తెలంగాణ వైపు ఏపి విద్యార్థులు వస్తున్నారన్నారు. మీ పాలనలో 60 ఏండ్ల కాలంలో ఒక్క మెడికల్ కాలేజ్ కట్టలేదు ఎందుకో మరి బదులిస్తారా? అని ఎర్రళ్ల ప్రశ్నించారు. మీరు రాజకీయ విమర్శలు చేస్తే మీ ఆంధ్ర రాష్ట్రంలో చేస్కో కానీ తెలంగాణ గురించి మాట్లాడితే ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని హితవు పలికారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News