Friday, January 24, 2025

‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’లో పాల్గొన్న ఎర్రోళ్ల శ్రీనివాస్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వైద్యమౌలిక సదుపాయల అభివృద్ధి సంస్థ చైర్మన్ డా.ఎర్రోళ్ల శ్రీనివాస్ తన జన్మదినం సందర్భంగా వెస్ట్ మారేడ్ పల్లిలోని నెహ్రూ నగర్ వాకర్ పార్కులో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. ”తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం దేశ వ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యతను సంపాదించుకుంది. తెలంగాణలో ఇప్పటివరకు కొన్ని కోట్ల మొక్కలను నాటడం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ చూసిన కానీ గ్రీనరీతో రాష్ట్రం కళకళాడుతుంది. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ తమ పుట్టిన రోజుసందర్భంగా ఒక మొక్కను నాటాలి. ఇంకో ముగ్గురు నాటాలని పిలుపునివ్వాలి” అని చెప్పారు.

Errolla Srinivas plant Saplings in West Marredpally

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News