Monday, January 20, 2025

హరీష్ రావు మద్దతుగా ఏకగ్రీవ తీర్మానం చేసిన ఎరుకల కులస్థులు

- Advertisement -
- Advertisement -

సిద్ధిపేట: ఎరుకల కుల అభివృద్ధికి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఎరుకల సాధికారత పథకం ప్రకటించిన సందర్భంగా వాళ్లు హర్షం వ్యక్తం చేశారు. ఎరుకల కులస్తులు అభివృద్ధి గురించి సిద్దిపేటలో ఆత్మగౌరవంగా ఎరుకల భవనాన్ని నిర్మించినారని పందుల నిషేధం అనంతరం సిద్దిపేటలోని ఎరుకల కులస్తులకు ఎంతోమందికి ఉపాధిని కల్పించారు. సిద్దిపేటను అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన తమరికి సిద్దిపేట ప్రాంత ప్రజలుగా ఎప్పటికీ రుణపడి ఉంటామని సిద్దిపేట రూరల్ మండలం ఎరుకల సంఘం ప్రతినిధులు మంత్రి హరీష్ రావు కలిసి చెప్పారు.. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎరుకుల కులస్తులకు ఆత్మగౌరవంగా హైదరాబాద్ నగరంలో స్థలం కేటాయించి భవనాన్ని నిర్మిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఎరుకల సాధికారిత పథకాన్ని తెచ్చిన ఏకైక ప్రభుత్వం బి ఆర్ ఎస్ అని.. ఈ సందర్భంగా సిద్దిపేట రూరల్ మండలం ఎరుకల కులస్తులం అందరం తమరికి మద్దతుగా ఏకగ్రీవ తీర్మానం చేస్తున్నామని చెప్పారు. వచ్చే ఎన్నికలలో తమరిని భారీ మెజారిటీతో గెలిపిస్తామని ముక్తకంఠంతో నినదించారు.. ఏకగ్రీవ తీర్మానాన్ని మంత్రి హరీష్ రావు  అందజేశారు. ఎరుకల సాధికారితతో ఎరుకల గౌరవాన్ని పెంచామని , మీరు అందించిన ప్రేమను ఆప్యాయతను ఎల్లప్పుడూ గుండెల్లో పెట్టుకుంట అని మంత్రి హరీష్ రావు అన్నారు.

Also Read: మూడో బౌలర్‌గా జడేజా

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News