Wednesday, January 22, 2025

కిలయూయా అగ్నిపర్వతం విస్ఫోటనం

- Advertisement -
- Advertisement -

హోనోలూలూ : ప్రపంచంలోనే అత్యంత జ్వలిత శక్తితో ఉండే కిలయూయా అగ్నిపర్వతం తిరిగి విస్ఫోటనం చెందుతోంది. రెండునెలలుగా ఇది ప్రశాంతంగా ఉంటూ వచ్చింది. హవాయ్‌లోని ఈ అగ్నిపర్వతం నుంచి లావాలు నెమ్మదిగా ప్రవహిస్తున్నాయి. అయితే జనావాస ప్రాంతాలకు , ఈ దీవిలోని నేషనల్ పార్క్ కట్టడాలకు ఇప్పటికైతే ఎటువంటి ముప్పులేదని వెల్లడైంది. ఆదివారం ఈ అగ్నిపర్వతం పేలుడు గురించి అక్కడి అబ్జర్వేటరీ ద్వారా గుర్తించారు. ఇంతకు ముందు ఈ ఏడాది జూన్‌లో ఈ అగ్నిపర్వతం పేలింది. పలు వారాల పాటు లావా వెలువడింది. ఈ దశలో తలెత్తిన ఎరుపు రంగు లావా స్థానిక ప్రజలకు కానీ, నిర్మాణాలకు కానీ ఎటువంటి ముప్పు కల్గించలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News