Wednesday, January 22, 2025

ఆర్‌కె సినీ మాక్స్‌లో ఎస్కలేటర్ ప్రమాదం

- Advertisement -
- Advertisement -

Escalator accident at RK Cinemax

12 మంది విద్యార్థులకు స్వల్ప గాయాలు
8 మంది డిశ్చార్జ్ నలుగురికి చికిత్స
పరామర్శించిన మేయర్

హైదరాబాద్: స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా గురువారం బంజారాహిల్స్‌లోని ఆర్‌కె సినీ మాక్స్‌లో గాంధీ సినిమా చూసేందుకు వచ్చిన భారతీయ విద్యా భవన్ స్కూల్‌కు చెందిన12 మంది విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు. సినీ మాక్స్ పైకి వెళ్లేందుకు విద్యార్థులు ఎస్కలటర్ ఎక్కారు. అయితే ఎస్కలేటర్ ఒక్కసారిగా వేగంగా వెళ్లడంతో 12 మంది విద్యార్థులు కింద పడిపోయ్యారు. దీంతో12 మంది విద్యార్థులు స్వల్పగా గాయపడ్డారు. వీరందరినీ అధికారులు హూటాహుటిన అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ వెంటనే చికిత్సను అందించిన డాక్టర్లు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాని, వారికి ఏలాంటి ప్రమాదం లేదని అపోలో వెల్లడించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశాల మేరకు పిల్లలకు జూబ్లీ హిల్స్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్సను హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఆర్ కె సినీ మాక్స్ థియేటర్ లో జరిగిన సంఘటనలో పిల్లలకు చిన్న చిన్న గాయాలు మాత్రమే అయ్యాయని వారికి ఎలాంటి ప్రమాదం లేదని, పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని తెలిపారు.

విద్యార్థులను పరామర్శించిన మేయర్ 
బంజారాహిల్స్‌లోని అర్ కే సినిమా థియేటర్‌లో ఎస్కలేటర్ ప్రమాదంలో గాయపడి అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భారతీయ విద్య భవన్ విద్యార్థులను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పరామర్శించారు. ఈ ప్రమాదంలో మొత్తం 12మంది విద్యార్థులకు గాయాలు పడగా, ఇందులో స్వల్పగాయాలైన 8 మంది విద్యార్థులు చికిత్స అనంతరం డిశ్చార్జి అయినట్లు తెలిపారు. మరో4 విద్యార్థులు చికిత్స పొందుతున్నారని తరువాత డిశ్చార్జి చేయనున్నట్లు అపోలో హాస్పిటల్ డైరెక్టర్ తెలిపరన్నారు. అంతకు ముందు జరిగిన ప్రమాదం విద్యార్థులను మేయర్ అడిగి తెలుసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News