Sunday, January 19, 2025

త్రుటిలో చావు నుంచి తప్పించుకున్నాం: షేక్ హసీనా

- Advertisement -
- Advertisement -

బంగ్లాదేశ్‌లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో షేక్ హసీనా ఆ దేశ ప్రధాని పదవిని కోల్పోయిన విషయం విదితమే. ప్రస్తుతం ఆమె భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. తాజాగా ఆమె కీలక విషయాలు వెల్లడించారు. నిరుడు ఆగస్టులో అవామీ లీగ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయని, ఆ ఘటనల్లో 600 మందికి పైగా మరణించారని హసీనా తెలియజేశారు. తనపై కూడా హత్యా యత్నం జరిగిందని, తాను, తన సోదరి రెహానా 20 నుంచి 25 నిమిషాల వ్యవధిలో చావు నుంచి తప్పించుకున్నామని ఆమె తెలిపారు, మృత్యువు నుంచి తప్పించుకుని భారత్‌కు చేరుకున్నామని ఆమె చెప్పారు. హసీనా అవామీ లీగ్ పార్టీ ఫేస్‌బుక్ ఖాతాలో ఆడియో సందేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

గతంలో కూడా తనపై పలు మార్లు హత్యా యత్నాలు జరిగాయని 77 ఏళ్ల హసీనా తెలియజేశారు. 2000లో కోటలీపుర బాంబు దాడి నుంచి బయటపడ్డానని, 2004లో మరొక సారి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డానని ఆమె చెప్పారు. అల్లా దయ వల్లే తాను మృత్యువును తప్పించుకున్నట్లు ఆమె చెప్పారు. తన రాజకీయ ప్రత్యర్థులు తన హత్యకు కుట్ర పన్నుతున్నారని ఆమె ఆరోపించారు. ‘నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. నాకు నా దేశం, నా ఇల్లు లేవు. అన్నిటినీ దగ్ధం చేశారు’ అని హసీనా తెలిపారు. 2000లో హర్కతుల్ జీహాద్ బంగ్లాదేశ్‌కు చెందిన ఉగ్రవాదులు బాంబు పెట్టి హసీనాను చంపాలని చూశారు. అయితే, బాంబు నిర్వీర్య బృందాలు వాటిని తొలగించడంతో ఆమె ప్రాణాలతో బయటపడ్డారు. 2004 ఆగస్టులో ఉగ్రవాద వ్యతిరేక ర్యాలీలో దాడి జరిగింది. ఆ ర్యాలీలో 24 మ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News