Wednesday, January 22, 2025

ఇషా సింగ్ జోడీకి స్వర్ణం

- Advertisement -
- Advertisement -

ప్రపంచ జూనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్

మన తెలంగాణ/హైదరాబాద్: జర్మనీ వేదికగా జరుగుతున్న ప్రపంచ జూనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్లు పతకాల పంట పండించారు. గురువారం భారత షూటర్లు ఏకంగా మూడు స్వర్ణాలు గెలిచి చరిత్ర సృష్టించారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో భారత్‌కు చెందిన ఇషా సింగ్‌సౌరబ్ చౌదరి జోడీ పసిడి పతకం సాధించింది. గురువారం జరిగిన ఫైనల్లో ఇషా సింగ్ జోడీ 1610 పాయింట్ల తేడాతో భారత్‌కే చెందిన పలక్‌సరబ్‌జోత్ సింగ్ జంటను ఓడించింది. ఆరంభం నుంచే ఇషా సింగ్ జోడీ నిలకడైన ప్రదర్శనతో లక్షం దిశగా అడుగులు వేసింది. చివరి వరకు అదే జోరును కొనసాగిస్తూ స్వర్ణాన్ని సొంతం చేసుకుంది. తెలంగాణ యువ షూటర్ ఇషా సింగ్ అంతర్జాతీయ షూటింగ్ పోటీల్లో అసాధారణ ప్రతిభతో పతకాల పంట పండిస్తోంది. మరోవైపు పురుషుల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో భారత షూటర్ శివ నర్వాల్ పసిడి పతకం గెలుచుకున్నాడు. భారత్‌కే చెందిన సరబ్‌జోత్ సింగ్ రజతం సాధించాడు. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో భారత షూటర్ పలక్ స్వర్ణం సొంతం చేసుకుంది. మరో భారత షూటర్ మనుబాకర్ రజతం దక్కించుకుంది. కాగా ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో రమితపార్థ్ (భారత్) జోడీ రజతం సాధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News