Tuesday, January 28, 2025

ఎస్సార్ గ్రూప్ వ్యవస్థాపకుడు శశి రుయా కన్నుమూత

- Advertisement -
- Advertisement -

ఎస్సార్ గ్రూప్ సహ వ్యవస్థాపకుడు శశికాంత్ రుయా(81) వృద్ధాప్య కారణంగా మంగళవారం కన్నుమూశారు. ఆయన తన జీవితంలో లక్షలాది మందికి ఉపాధి కల్పించారు. ఎన్నో దాతృత్వ కార్యక్రమాలు నిర్వహించారు.

శశి రుయా 1943లో జన్మించారు. ఆయన మెకానికల్ ఇంజనీరింగ్ లో గ్రాడ్యయేషన్ పూర్తి చేశారు. తన సోదరుడు రవి రుయాతో కలిసి 1969లో ఎస్సార్ గ్రూప్ స్థాపించారు. వీరి గ్రూప్ మద్రాస్ పోర్ట్ ట్రస్ట్ ఔటర్ బ్రేక్ వాటర్ నిర్మాణం విజయవంతంగా మొదట్లో పూర్తి చేసింది. అప్పట్లో ఈ ప్రాజెక్టు విలువ రూ. 2.5 కోట్లు. దాంతో ఎస్సార్ గ్రూప్ కు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఎస్సార్ గ్రూప్ అనేక ప్రాజెక్టులు చేపట్టి విస్తరించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News